“మత్తు వదలరా 2” రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీ సింహా కోడూరి(Sri simha koduri), నరేష్ అగస్త్య, సత్య(Satya) కీలక పాత్రల్లో నటించిన మత్తు వదలరా(Mathu vadalara) సినిమా డార్క్ కామెడీ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 2019లో రిలీజైన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు దర్శకుడు రితేష్ రానా. మత్తు వదలరా 2(Mathu vadalara 2) సినిమాను క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13న థియేటర్స్ లోకి రాబోతోంది. మత్తు వదలరా తర్వాత దర్శకుడు రితేష్ రానా లావణ్య త్రిపాఠీ డబుల్ యాక్షన్ లో హ్యాపీ బర్త్ డే అనే కళాఖండం రూపొందించాడు. దీని ఎఫెక్ట్ ఇప్పుడు మత్తు వదలరా 2 పైనా ఉండబోతోంది.