అభిమాని కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్

ఇటీవల చిరంజీవి(Chiranjeevi) పుట్టినరోజున పొర్లు దండాలు పెడుతూ తిరుమల కొండ ఎక్కిన అభిమాని ఈశ్వరయ్య(Eshwarayya)ను మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఈ రోజు హైదరాబాద్ లోని తమ ఇంటికి వారిని కుటుంబ సమేతంగా ఆహ్వానించి కొత్త బట్టలు బహూకరించారు చిరంజీవి. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. అభిమాని చూపించిన ప్రేమకు చలించిపోయారు మెగాస్టార్.

తాము ఆరాధించే అభిమాన హీరో ఇలా తమను ఇంటికి పిలిచి సత్కరించడంతో అభిమాని ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు కూడా సంతోషించారు. తన అభిమానిని మెగాస్టార్ సత్కరించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.