జాతకాలు చెబుతున్న ప్రియదర్శి

‘సారంగపాణి జాతకం’ (Sarangapani jathakam) అనే మరో సినిమాతో ప్రియదర్శి(Priyadarshi) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రూప కొడవయూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.

టైటిల్ పోస్టర్ లో ప్రియదర్శి హస్తసాముద్రికుడిగా కనిపిస్తున్నారు. శ్రీదేవి మూవీస్(Sridevi movies) బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘సారంగపాణి జాతకం’ సినిమా 90శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే మిగతా పార్ట్ షూటింగ్ చేసి రిలీజ్ కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.