నెట్ ఫ్లిక్స్ లోకి వస్తున్న “బడ్డీ”

అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఈ నెల 30న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. ఈ నెల 2న థియేటర్స్ లోకి వచ్చిన బడ్డీ సినిమా పిల్లల్ని పెద్దల్ని ఎంటర్ టైన్ చేసింది. ఓ డిఫరెంట్ అటెంప్ట్ గా ప్రశంసలు అందుకుంది.

బడ్డీ సినిమాను దర్శకుడు సామ్ ఆంటోన్ రూపొందించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్స్ గా నటించారు. బడ్డీ ఓటీటీలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని అలరించబోతోంది.