చెరువు భూమి అంగుళం కూడా ఆక్రమించలేదు – హీరో నాగార్జున

తమ ఎన్ కన్వెన్షన్(N convention) కూల్చివేతపై హీరో నాగార్జున(Nagarjuna) రెస్పాండ్ అయ్యారు. ఎన్ కన్వెన్షన్ కోసం అంగుళం చెరువు భూమిని కూడా ఆక్రమించలేదని, అది పట్టా భూమి అని ఆయన చెప్పారు. కూల్చివేతలపై హైకోర్ట్ ను ఆశ్రయిస్తామని నాగార్జున తెలిపారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే ఉన్నా అధికారులు తొందరపడ్డారని నాగార్జున బాధను వ్యక్తం చేశారు.

నాగార్జున మాట్లాడుతూ – స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. అన్నారు.