యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి కర్ణాటకలోని కూర్గ్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. కూర్గ్ లోని ఓ రిసార్ట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ స్టైల్ లో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలకు కిరణ్ అబ్బవరం, రహస్య కుటుంబ సభ్యులు, దగ్గరి మిత్రులు హాజరయ్యారు. ఈ కొత్త జంట వివాహ వేడుకల ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ నెటిజన్స్ ఈ కొత్త జంటకు విశెస్ తెలియజేస్తున్నారు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క లో నటిస్తున్నారు. ఈ త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సీయీవోగా రహస్య పనిచేస్తుండటం విశేషం.