హీరో నాగచైతన్య కార్ రేసింగ్ కాంపిటేషన్ లోకి అడుగుపెట్టారు. రేసింగ్ కార్లను ఇష్టపడే నాగ చైతన్య ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్)లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు. ఫార్ములా 4 రేస్ లో నాగ చైతన్య ఫ్రాంఛైజీ పోటీ పడనుంది. ఈనెల 24వ తేదీ నుంచి ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతోంది.
హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడంతో తన కల నిజమైందని నాగ చైతన్య అన్నారు. ఈ ఫ్రాంఛైజీతో తన ఫ్యాషన్ ఏంటో చూపించుకునే అవకాశం దక్కిందని ఆయన అన్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో పాల్గొంటున్న ఆరు టీమ్స్‌లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఒకటి. బాలీవుడ్ హీరోలు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ కూడా ఈ ఫ్రాంఛైజీలో పార్టనర్స్ గా ఉన్నారు.