“హనుమాన్”తో వచ్చింది “డబుల్ ఇస్మార్ట్”తో పోయింది

సినిమా నిర్మాణం ఒక గ్లాంబ్లింగ్. పేకాటలో ఒక ఆట గెలిచి డబ్బులు వస్తే మరో ఆటలో పోయినట్లు..ఇక్కడ ఒక హిట్ సినిమా సంపాదించేది మరో ఫ్లాప్ ఊడ్చేస్తుంది. హనుమాన్(Hanuman) ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి(Niranjan reddy) విషయంలో ఇదే జరుగుతోంది. హనుమాన్ సినిమా వరల్డ్ వైడ్ గా మంచి వసూళ్లు సాధించింది. పెట్టుబడికి ఎన్నో రెట్ల లాభాలు తీసుకొచ్చింది.

ఇదే ఊపులో డబుల్ ఇస్మార్ట్(Double ismart) సినిమా టోటల్ రైట్స్ తీసుకున్నారు నిరంజన్ రెడ్డి. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. కలెక్షన్స్ లేవు, ఎక్కడా సినిమా మాటే లేదు. మొత్తం రైట్స్ తీసుకున్న నిరంజన్ రెడ్డికి దాదాపు 40 కోట్ల వరకు నష్టం తప్పేలా లేదు. ఇలాంటి లాభ నష్టాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టే లాంగ్ రన్ లో తట్టుకుని నిలబడే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మందే కనిపిస్తుంటారు.