అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా రంగంలోకి విజయ్

మరో రెండేళ్లకు తమిళనాట రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ బరిలోకి దిగుతున్నారు స్టార్ హీరో విజయ్(Vijay). ఆయన తమిళగ వెట్రి కళగం అనే పార్టీని గత లోక్ సభ ఎన్నికలకు ముందే ప్రకటించారు. ఈ రోజు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, అభిమానులు మధ్య సందడిగా ఈ కార్యక్రమం జరిగింది.

దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన త్యాగధనుల స్ఫూర్తితో, తమిళ వీరుల ఆశయాలు కాపాడేలా తమ పార్టీ ప్రజాసేవ చేస్తుందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే తమ పార్టీ లక్ష్యమని విజయ్ ఈ సందర్భంగా అన్నారు. తమిళనాట ఇప్పటికే చాలా మంది సినీ నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే కమల్ హాసన్(kamal hasaan) లాంటి దిగ్గజాలకే చేదు అనుభవం ఎదురైంది. విజయ్ పార్టీ మనుగడ ఏంటన్నది కూడా ఊహాతీతమే.