ప్రైమ్ వీడియోలోకి వచ్చేస్తున్న “తుఫాన్”

విజయ్ ఆంటోనీ(Vijay antony) హీరోగా నటించిన తుఫాన్(Toofan) సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా త్వరలోనే అమోజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video)లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ నెల 2న తమిళంలో, ఈ నెల 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. తుఫాన్ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు.

పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో దర్శకుడు విజయ్ మిల్టన్ రూపొందించారు. మేఘా ఆకాష్, శరణ్య పొన్వన్నన్, సత్యరాజ్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. సరికొత్త మేకింగ్ తో ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడు ప్రైమ్ వీడియో ద్వారా మరింత మంది ఆడియెన్స్ కు తుఫాన్ మూవీ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.