ఎనర్జిటిక్ హీరో రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ముంబాయిలో షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇటీవల రామ్ మరి కొంత మంది ఫైటర్స్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఇందులో విలన్ పాత్రకు గాను బాలీవుడ్ స్టార్స్ ను కాంటాక్ట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సంజయ్ దత్ కన్ ఫర్మ్ అయ్యాడని.. విలన్ గా నటిస్తున్నాడని తెలిసింది. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి భారీ తారాగణంతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ మూవీ కోసం సంజయ్ దత్ పది కోట్ల భారీ రెమ్యూనరేషన్ అడిగారని.. దీనికి పూరి, ఛార్మి ఓకే చెప్పారని తెలిసింది. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ కాబట్టి డబుల్ ఇస్మార్ట్ మూవీకి భారీగా క్రేజ్ ఉంది. అందుకనే సంజయ్ దత్ 10 కోట్లు అడిగినా.. నో చెప్పకుండా వెంటనే ఓకే చెప్పారట. హీరోయిన్స్ ఎవరు అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈసారి పూరి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.