హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ పెళ్లి తేదీ ఖరారు

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహానికి తేదీ ఖరారైంది. వీరి పెళ్లి రేపు కర్నాటకలోని కూర్గ్ లోని ఓ రిసార్ట్ లో జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్. కుటుంబ సభ్యులు, సన్నిహితులైన మిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరగనుంది.

రేపు రాత్రి పెళ్లికి ముహూర్తంగా నిర్ణయించారు. రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ఆ సినిమా చిత్రీకరణ సమయం నుంచే ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. కిరణ్ అబ్బవరం క సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.