ఈ క్రికెట్ వీరుడి బయోపిక్ వస్తోంది

ఈ తరం భారత క్రికెట్ జట్టు సాధించిన రెండు గొప్ప విజయాలు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్. ఈ రెండు విజయాల్లో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvaraj singh). ఈ స్టార్ క్రికెటర్ బయోపిక్ అనౌన్స్ అయ్యింది. టీ సిరీస్ నిర్మాత భూషణ్ కుమార్(T series Bhushan kumar), రవి అనే మరో ప్రొడ్యూసర్ తో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ బయోపిక్ లో నటీనటులు ఎవరనేది త్వరలో ప్రకటించనున్నారు.

బ్యాటుతో, బాల్ తో ప్రతిభ చూపించి టీమ్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాలు అందించారు యువరాజ్ సింగ్. కెరీర్ కీలక దశలో ఉన్న సమయంలో కేన్సర్ బారిన పడిన యువరాజ్.. కోలుకుని మళ్లీ భారత జట్టుకు ఆడి ఎన్నో మ్యాచ్ లు గెలిపించాడు. ఇప్పటికే సచిన్, ధోని వంటి ఎంతోమంది క్రికెటర్స్ బయోపిక్స్ తెరపైకి రాగా..యువరాజ్ సింగ్ బయోపిక్ పై ఆసక్తినెలకొంది.