త్రివిక్రమ్ తో విబేధాలు లేవు – హరీశ్ శంకర్

త్రివిక్రమ్(Trivikram) తో తనకేమీ విబేధాలు లేవని అంటున్నారు హరీశ్ శంకర్(Hareesh shankar). ఈ ఇద్దరు డైరెక్టర్స్ మధ్య గ్యాప్ ఉందనే టాక్ ఇటీవల మొదలైంది. దానికి కారణం హరీశ్ శంకర్ తన కొత్త సినిమా మిస్టర్ బచ్చన్(Mr bachan) లో గురూజీ(Guruji) అంటూ ఓ క్యారెక్టర్ పెట్టారు. ఆ పేరుతో కామెడీ చేయించారు. దాంతో త్రివిక్రమ్ కు కౌంటర్ గానే హరీశ్ శంకర్ ఈ క్యారెక్టర్ పెట్టాడనే అంటున్నారు. నెట్టింట ఈ విషయంపై చర్చ జరుగుతోంది. దీనిపై హరీశ్ శంకర్ స్పందించారు

హరీశ్ శంకర్ మాట్లాడుతూ – త్రివిక్రమ్ సినిమాలంటే నాకు ఇష్టం. మా నాన్న గారికి కూడా ఇష్టమే. త్రివిక్రమ్ గారి మీద గౌరవం ఉంది. ఆయనను దృష్టిలో పెట్టుకుని గురూజీ పాత్ర పెట్టలేదు. త్రివిక్రమ్ లా సినిమాలు చేయమని మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమపై త్రివిక్రమ్ తన ముద్రను వేశారు. అన్నారు. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ ను గురూజీ అని పిలుస్తారని హరీశ్ శంకర్ కు తెలియకపోవడం విచిత్రం.