వైసీపీ యాత్ర 2 వెర్సెస్ టీడీపీ ప్రతినిథి 2

ఇది ఎన్నికల టైమ్ కావడంతో రాజకీయ సినిమాలు థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే పొలిటికల్ మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తిగా వైసీపీ కోసం తీస్తున్న మూవీ. అయితే.. వర్మ ఫామ్ లో లేకపోవడంతో జనాలు అంతగా పట్టించుకోవడం లేదు. వైసీపీ వై.ఎస్ జగన్ కు సపోర్ట్ గా దర్శకుడు మహి వి రాఘవ యాత్ర 2 సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఫిబ్రవరి 2024న విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచేసింది.

ఇదిలా ఉంటే.. నారా రోహిత్, పెదనాన్న నారా చంద్రబాబు నాయుకు సపోర్ట్ గా ప్రతినిథి 2 అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా రాజకీయ చిత్రమే. ఈ చిత్రాన్ని జర్నలిస్ట్ మూర్తి తెరకెక్కిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ గా తీయడం లేదని అంటున్నాయి కానీ.. టీడీపీకి సపోర్ట్ గా తీయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇవి కాకుండా మరి కొన్ని రాజకీయ చిత్రాలు థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రెండు చ్రితాల పై అందరిలో ఆసక్తి ఉంటుంది. మరి.. ఏ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.