ఆగస్టు 2న వస్తున్న “బడ్డీ”

అల్లు శిరీష్(Allu sirish) “బడ్డీ” (Buddy) సినిమా రిలీజ్ డేట్ మారింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 2న రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తాజాగాా వెల్లడించారు. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ (gayatri bharadwaj), ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ (studio green films ) బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా (KE jnanavel raja), అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

బడ్డీ అనే టెడ్డీ బేర్ క్యారెక్టర్ తో “బడ్డీ” సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుంది. హీరో అల్లు శిరీష్ తో పాటు బడ్డీ చేసే సాహసాలు ఆకట్టుకోనున్నాయి. ఈ టైప్ ఆఫ్ మూవీ మన ఆడియెన్స్ కు కొత్త. రీసెంట్ గా రిలీజ్ చేసిన “బడ్డీ” సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ స్క్రీన్స్ మీద ఎంతగా మ్యాజిక్ చేస్తుందో ఆగస్టు 2న చూడాలి.