రామ్ చరణ్ సినిమాలో కన్నడ స్టార్

రామ్ చరణ్ (Ram charan) హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన (Buchi babu sana) రూపొందిస్తున్న సినిమా నుంచి లేటెస్ట్ అప్డేడ్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Sivaraj kumar) నటిస్తున్న అఫీషియల్ గా ప్రకటించారు. శివరాజ్ కుమార్ పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉండనుంది. ఆర్ సీ 16గా పిలుస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ ఉంటాడని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అది నిజం చేస్తూ ఈ రోజు టీమ్ న్యూ పోస్టర్ తో ఆయనకు మూవీలోకి వెల్కమ్ చెప్పింది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఆర్ సీ 16 (RC 16) తెరకెక్కనుంది. జాన్వీ కపూర్ (Jhanvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా రామ్ చరణ్ కనిపించనున్నారు.