హీరోయిన్ ను అశ్లీలంగా చూపించారు

రవితేజ (Raviteja) హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ (Mr bachhan) సినిమాలోని సితార్ పాట (Sitar song)లో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే (Bhagyasree borse)ను హాట్ గా చూపించడం సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. ఈ పాటలో భాగ్య శ్రీ భోర్సే ముఖానికి కంటే ఎక్కువగా బాడీ చూపించారనే విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్. హీరోయిన్ ఆటబొమ్మని దర్శకుడు భావించాడేమో అని విమర్శిస్తూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. హీరోయిన్ ను అశ్లీలంగా చూపించారంటూ అతను పోస్ట్ లో పేర్కొన్నాడు.

ఈ పోస్ట్ పై హరీశ్ శంకర్ (harish shankar) స్పందించాడు. పాటను మీరు అబ్జర్వ్ చేసిన తీరుకు నోబెల్ బహుమతి ఇవ్వాలి. మీరు కూడా సినిమాలను ఇలాగే చిన్న చూపు చూస్తూ ఉండండి అంటూ రిప్లై ఇచ్చాడు. మిస్టర్ బచ్చన్ నుంచి సితార్ సాంగ్ ను ఫస్ట్ లిరికల్ సాంగ్ గా రిలీజ్ చేశారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ రైడ్ తెలుగు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (people media factory) ఈ సినిమాను నిర్మిస్తోంది.