మోస్ట్ సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ “పొలిమేర 3” వచ్చేస్తోంది

ఇటీవల కాలంలో తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న హారర్ థ్రిల్లర్ పొలిమేర (Polimera). ఈ సినిమాకు ఇప్పటికే సీక్వెల్ పొలిమేర 2 (Polimera 2) తెరకెక్కి ఘన విజయాన్ని సాధించింది. మన దగ్గర సీక్వెల్స్ సక్సెస్ అవడం అరుదు. ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది పొలిమేర 2. ఇప్పుడీ సిరీస్ లో మూడో సినిమా రాబోతోంది. పొలిమేర 3 సినిమాను ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ (Anil vishwanath) దర్శకత్వం వహించనున్నారు.

నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి (Vamsi nandipati) “పొలిమేర 3” నిర్మించనున్నారు. “పొలిమేర 3” అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. “పొలిమేర 3” లో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.