మరికొన్ని శనివారాలు కావాలేమో

నాని(Nani) హీరోగా సరిపోదా శనివారం (saripoda sanivaram) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ క్విక్ గా జరుగుతున్నా అనుకున్న డేట్ కు రిలీజ్ కష్టమేననే టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 29న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు టీమ్ ప్రకటించారు. అయితే మరికొన్ని శనివారాలు ఈ సినిమా షూటింగ్ కు కావాలేమో అని టీమ్ అంటున్నారట. దీంతో ఆగస్టు 29న సినిమా రిలీజ్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరో వారం లేదా రెండు వారాలు ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ (vivek athreya)రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ (DVV entertainments) లో దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ (priyanka mohan) హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జే సూర్య విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన లుక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.