రామ్ చరణ్ లో ఆ పవర్ ఉంది – శంకర్

హీరో రామ్ చరణ్ (Ram charan) పై పొగడ్తలు కురిపించారు దర్శకుడు శంకర్ (Director shankar). సాధారణంగా తన హీరోల గురించి ఎక్కువగా మాట్లాడని ఈ దర్శకుడు రామ్ చరణ్ ను మాత్రం ప్రశంసించారు. సినిమాను ప్రేమించే సపోర్ట్ చేసే తెలుగు ప్రేక్షకుల కోసం తాను సినిమా చేయాలని అనుకున్నానని, అది గేమ్ ఛేంజర్(Game changer) తో జరగడం సంతోషంగా ఉందని శంకర్ అన్నాడు.

రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని, కంట్రోల్డ్ పవర్ ఉన్న స్టార్ రామ్ చరణ్ అని శంకర్ చెప్పారు. రామ్ చరణ్ లో ఉన్న పవర్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదని, ఆయనతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉందని శంకర్ తెలిపాడు. మరో పది హేను రోజుల్లో గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ అ‌వుతుందని, రామ్ చరణ్ పార్ట్ ముగించామని చెప్పాడు. త్వరలోనే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని శంకర్ అన్నాడు.