“మహారాజ” స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేస్తూ మంచి సినిమాలు భాషలకు అతీతంగా ఆదరణ పొందుతున్నాయి. “మహారాజ” (Maharaja) సినిమానే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడీ మూవీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.

ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ తాజాగా ఈ అనౌన్స్ మెంట్ చేసింది. థియేటర్స్ లో దక్కిన ఘన విజయంతో “మహారాజ” ఓటీటీ రిలీజ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు స్వామినాథన్ దర్శకత్వం వహించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ (mamta mohandas), అభిరామి (Abhirami), భారతీరాజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో మహారాజ అందుబాటులో ఉండనుంది.