నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న “భజే వాయు వేగం”

కార్తికేయ గుమ్మకొండ (Karthikeya gummakonda) హీరోగా నటించిన “భజే వాయు వేగం” (Bhaje vayu vegam) సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. మూడు రోజుల కిందట నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. తక్కువ టైమ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా నెంబర్ 2లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

“భజే వాయు వేగం” సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ (UV concepts) బ్యానర్ నిర్మించింది. కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ (Rahul tyson) కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి (Prashant reddy) ఈ చిత్రాన్ని రూపొందించారు. థ్రిల్లర్స్ ఇష్టపడే మూవీ లవర్స్ నెట్ ఫ్లిక్స్ లో “భజే వాయు వేగం” సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.