ఏడు ఫ్లాప్స్ తర్వాత ఈ “నవ దళపతి” ఏంటో

సుధీర్ బాబు (Sudheer babu) బ్యాక్ టు బ్యాక్ ఇచ్చే ఫ్లాప్స్ కంటే ఆయనకు తగిలిస్తున్న కొత్త పేర్లే ప్రేక్షకుల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి. ఆ మధ్య నిట్రో స్టార్ (Nitro star) అని ఎవరికీ అర్థం కాని బిరుదు ఇచ్చారు. రెండు మూడు సినిమాలు ఆ పేరుతోనే చేశాడు సుధీర్. ఈ మధ్య హరోం హరం (Harom hara) ఇంటర్వ్యూస్ లో నిట్రో స్టార్ అని పిలవడం తనకు ఇష్టం లేదని చెప్పాడు.

ఇప్పుడు సుధీర్ బాబుకు మరో పేరు ఆయన పెట్టారు అదే నవ దళపతి (Nava thalapathy). దళపతి అనే పేరు తమిళ్ హీరోలకు ఉంటుంది. మన దగ్గర అలాంటిది ఏ హీరో ముందు లేదు. అసలు ఇలాంటి పేరు తనకు పెట్టారని సుధీర్ బాబుకు తెలుసో లేదో. తెలిసే ఒప్పుకున్నాడో తెలియదు. ఏడు ఫ్లాప్స్ తర్వాత ఆయన స్టార్ డమ్ ను ఎలా చెప్పాలో తెలియక ఇలాంటి పేర్లు పెడుతున్నారా

సుధీర్ బాబు ఇప్పుడు ఓ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌బోతున్నారు. ఇది భారీ బ‌డ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. వెంట్ క‌ళ్యాణ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. రుస్తుం, టాయ్‌లెట్‌: ఏక్ ప్రేమ్ క‌థ‌, ప్యాడ్ మ్యాన్‌, ప‌రి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన ప్రేర‌ణ అరోరా (Prerana arora) స‌మ‌ర్ప‌ణ‌లో సుధీర్ బాబు సూప‌ర్ నేచుర‌ల్ మిస్టరీ థ్రిల్ల‌ర్ తెరకెక్కనుంది.