ట్రోలర్స్ కు డీపీతో ఆన్సర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

హీరోగా విజయ్ దేవరకొండ (Vijay devarakonda)కు ఫేమ్ రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా (Social media) గ్రూప్స్ పనిగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాల మీద నెగిటివ్ పోస్టులు చేశారు. ఇంటెన్షనల్ గా కొందరు విజయ్ సినిమాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆయన కల్కి (Kalki 2898AD)లో అర్జునుడి (arjuna) క్యారెక్టర్ చేశారు.

ఈ క్యారెక్టర్ పై కూడా ట్రోల్స్ (Trolls) చేస్తున్నారు. ఈ ట్రోల్స్ కు చెప్పకనే సమాధానం చెప్పారు విజయ్ దేవరకొండ. ఏ క్యారెక్టర్ నైతే ట్రోల్స్ చేస్తున్నారో అదే అర్జునుడి క్యారెక్టర్ గెటప్ నే డీపీ (Social media DP)గా తన సోషల్ మీడియా అక్కౌంట్స్ కు పెట్టుకున్నారు. కల్కి సినిమాలో ఎన్నో గెస్ట్ రోల్స్ ఉన్నా వాటిలో విజయ్ చేసిన అర్జునుడి క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ దీనికి రివర్స్ గా ఆ క్యారెక్టర్ నే కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.