“కల్కి 2” రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

జూన్ 27 కల్కి (Kalki 2898AD) రిలీజ్ డేట్. ఇదే డేట్ కు వచ్చే ఏడాది కల్కి సీక్వెల్ కల్కి 2 (Kalki 2)ను రిలీజ్ చేస్తామని నిర్మాత అశ్వనీదత్ (Ashwani dutt) ఇవాళ జరిగిన స్పెషల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కల్కి సీక్వెల్ కు సంబంధించి ఇప్పటికే కొంత షూటింగ్ జరిపామని, వీఎఫ్ఎక్స్ తో పాటు మిగతా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ఏడాది టైమ్ పట్టొచ్చని ఆయన అన్నారు. కల్కి సినిమా సక్సెస్ విషయంలో తమ నమ్మకం నిజమైందని అశ్వనీదత్ అన్నారు.

మహానటి (mahanati) సినిమా తర్వాత నాగ్ అశ్విన్ (Nag ashwin) దర్శకత్వ ప్రతిభపై తనకు బాగా నమ్మకం ఏర్పడిందని, ఆయన ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా డీల్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ ఏర్పడిందని అశ్వనీదత్ అన్నారు. ఇదే మాట తన కూతుర్లతో చెప్పానని, నాగ్ అశ్విన్ ఎంత భారీ ప్రాజెక్ట్ చేయాలని చెప్పినా సందేహించకుండా చేయండని సలహా ఇచ్చినట్లు ఆయన చెప్పారు. 500 కోట్లకు రీచ్ అవుతున్న ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ సునాయాసంగా రీచ్ అవుతుందనే నమ్మకాన్ని ఈ భారీ చిత్రాల నిర్మాత వ్యక్తం చేశారు.