ఈ దసరాకు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్

ఈ దసరా (Dasara) పండుగకు కోలీవుడ్ (Kollywood) బాక్సాఫీస్ (Boxoffice) వద్ద హోరాహోరీ ఫైట్ సాగనుంది. అటు రజినీకాంత్ (Rajnikanth) ఇటు సూర్య (Suriya) సినిమాలు ఒకే డేట్ కు రిలీజ్ కు వస్తుండటం తమిళ సినీ ప్రియుల్లో ఆసక్తి రేపుతోంది. రజినీకాంత్ వేట్టయాన్ (Vettaiyan) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీ రోల్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ లో దర్శకుడు టీజీ జ్ఞానవేల్ (TG Jnannavel) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫేక్ ఎన్ కౌంటర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అక్టోబర్ 10న వేట్టయాన్ రిలీజ్ కానుంది.

సూర్య పాన్ ఇండియా మూవీ కంగువ (Kanguva) కూడా అక్టోబర్ 10నే థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాను పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్య కంగువ రిలీజ్ డేట్ ఇవాళే అనౌన్స్ అయ్యింది. దీంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ దసరాకు సూర్య వర్సెస్ రజినీ టఫ్ ఫైట్ ఉండబోతోంది.