రికార్డుల కోసం “కల్కి” నిర్మించలేదంటూ స్వప్న దత్ ట్వీట్

కల్కి సినిమా (Kalki 2898AD) ఏ సినిమా రికార్డులు క్రాస్ చేసింది అని అడుగుతూ చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారని, అయితే రికార్డులు క్రాస్ చేయడం కోసం కల్కి చిత్రాన్ని నిర్మించలేదని నిర్మాత స్వప్న దత్ (Swapna dutt) ట్వీట్ చేశారు. అలా అడిగేవారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని ఆమె అన్నారు. తామే కాదు గతంలో రికార్డులు క్రియేట్ చేసిన ఎవ్వరూ ఆ నెంబర్స్ కోసం సినిమాలు నిర్మించరని స్వప్న దత్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

సినిమాలను ప్యాషన్ తో నిర్మిస్తామని స్వప్న దత్ చెప్పారు. చిత్ర పరిశ్రమలో వైజయంతీ మూవీస్ కు అందరు హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కల్కిలోనూ అనేక మంది స్టార్స్ గెస్ట్ లుగా నటించారు. అలాంటి టైమ్ లో తమ సినిమానే రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పుకోవడానికి స్వప్న దత్ ఇబ్బంది పడే ఉంటారు. మరోవైపు ప్రభాస్ (Prabhas) కల్కి సినిమా డే 1 కలెక్షన్స్ అదిరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 191 కోట్ల రూపాయలు వసూలు చేసింది.