లాంగ్ ఫార్మేట్ షోగా వస్తున్న “అగ్నిసాక్షి”

సీరియల్ లవర్స్ ఇష్టపడే జంట అర్జున్ అంబడి (Arjun ambadi), ఐశ్వర్య (Ishawarya). వీళ్ల పెయిర్ సీరియల్ కు హైలైట్ అవుతుంటుంది. అలాంటి పర్ ఫార్మన్స్ లతో అగ్నిసాక్షి (Agni sakshi) సీరియల్ తో మరోసారి అలరించేందుకు వస్తున్నారు అర్జున్ అంబడి, ఐశ్వర్య. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ (Disney plus hotstar) ఫస్ట్ టైమ్ లాంగ్ ఫార్మేట్ షోగా అగ్ని సాక్షి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. జూలై 12వ తేదీ నుంచి అగ్నిసాక్షి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

సీరియల్ లవర్స్ కోరుకునే ట్విస్ట్ లతో మంచి ఇంటెన్స్ కథతో పవర్ ఫుల్ ప్రెజెంటేషన్ తో అగ్నిసాక్షి ప్రేక్షకుల ముందుకొస్తోంది. అగ్నిసాక్షిలో స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ శంకర్ గా అర్జున్ అంబడి, గౌరి అనే యువతి పాత్రలో ఐశ్వర్య కనిపించనున్నారు. ఒక హత్య కేసు శంకర్, గౌరి జీవితాన్ని మలుపుతిప్పుతుంది. ఆ కేసు ఏంటి, ఆ కేసు ఇంపాక్ట్ ఈ జంటపై ఎలా పడింది అనేది ఆసక్తికరంగా ఉండనుంది. అగ్నిసాక్షికి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మంచి వ్యూయర్ షిప్ దక్కనుంది.