ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో (Book my show)లో ప్రభాస్ (Prabhas) కల్కి (Kalki 2898AD)కి బదులు రాజశేఖర్ (Rajashekar) కల్కి (Kalki) సినిమాకు టికెట్స్ బుక్ కావడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ న్యూస్ వైరల్ కావడంతో బుక్ మై షో స్పందించింది. రాజశేఖర్ కల్కి సినిమాకు బుక్ అయిన నాలుగు షోస్ టికెట్స్ కల్కి 2898ఎడి మూవీకి మార్చుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది.
రాజశేఖర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ కల్కి సినిమాను పోలీస్ కథతో తెరకెక్కించాడు. ఇదే పేరుతో ప్రభాస్ మూవీ వస్తుండటంతో బుక్ మై షో యాప్ లో మూవీ ఫొటోను రాంగ్ గా అప్ లోడ్ చేశారు. ఈ వైరల్ న్యూస్ పై హీరో రాజశేఖర్ కూడా స్పందించారు. నాకు ఈ విషయంతో సంబంధం లేదని ఆయన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ ఇతర టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.