కీలక దశకు “కుబేర” షూటింగ్

ధనుష్ (Dhanush) హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల (Shekar kammula) రూపొందిస్తున్న కుబేర (Kubera) సినిమా షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ కోసం ధనుష్ హైదరాబాద్ చేరుకున్నారు. నాగార్జున (Nagarjuna) ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. రశ్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తోంది.

ధనుష్, నాగార్జున వంటి ప్రధాన కాస్టింగ్ పై కుబేర కొత్త షెడ్యూల్ షూటింగ్ చేయబోతున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ తో కలిసి శేఖర్ కమ్ముల తన అమిగోస్ క్రియేషన్స్ (Amigos creations) లో నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే కుబేర రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తున్నా…మూవీ టీమ్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు.