యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘కల్కి’ జోరు

రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా ఈ నెల 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు యూఎస్ లో బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే హాఫ్ మిలియన్ దాటేశాయి. సినిమా రిలీజ్ కు మరో రెండు వారాలకు పైగా టైమ్ ఉన్నా ఈ బుకింగ్స్ స్పీడ్ చూస్తుంటే ప్రీ సేల్స్ లో కల్కి కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.

రేపు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. వైజయంతీ మూవీస్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. స్టార్స్ నటించడంతో పాటు పలువురు స్టార్స్ గెస్ట్ అప్పీయరెన్స్ లతో కల్కి ఎన్నో హైలైట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు అమోజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసిన బుజ్జి అండ్ భైరవ యానిమేటెట్ సిరీస్ కు కూడా అనూహ్య స్పందన వస్తోంది.