ఎమోషనల్ గా “8 వసంతాలు” టీజర్

ఒకప్పుడు వంద సినిమాలు రిలీజైతే వాటిలో మూడొంతుల లవ్ స్టోరీ మూవీస్ ఉండేవి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇంటెన్స్ యాక్షన్, రగ్డ్, మాస్ మూవీస్ వస్తున్నాయి. ప్రేమ కథల్లోనూ రా అండ్ రస్టిక్ ట్రెండ్ పెరిగింది. ఇలాంటి టైమ్ లో ఓ ప్లెజెంట్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని తీసుకొస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ సంస్థ నిర్మించిన 8 వసంతాలు సినిమా టీజర్ ఎమోషనల్ లవ్ స్టోరీతో సాగింది.

తమ లైఫ్ లో ప్రేమలో ఓడిపోయిన ఓ అబ్బాయి, అమ్మాయి..మరొక భాగస్వామిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే..ఆ జంట మధ్య భావోద్వేగాలు ఎలా ఉంటాయనేది టీజర్ లో హార్ట్ టచింగ్ గా చూపించారు. ప్రతి ఒక్కరిలో తుఫాన్ లు ఉంటాయి, కొందరు బయటపడతారు, మరికొందరు ఎప్పటికీ బయటపడరు అనే డైలాగ్ ఆకట్టుకుంది. అనంతిక, రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఫణింద్ర నర్సెట్టి రూపొందించారు. త్వరలో 8 వసంతాలు సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.