పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమా నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా ఏప్రిల్ 20, 2000 సంవత్సరంలో రిలీజైంది. పవన్ అప్పటికే తొలిప్రేమ, తమ్ముడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఆయన స్టార్ డమ్ ను మరింత పెంచేలా బద్రి సక్సెస్ అందించింది. ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు పూరి జగన్నాథ్..ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాలను అందించి స్టార్ డైరక్టర్ గా సెటిల్ అయ్యాడు.
పవన్ కల్యాణ్ కున్న క్రేజ్ కు తగినట్లు పూరి డిజైన్ చేసిన స్టైలిష్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. పవన్ మేనరిజమ్స్, డైలాగ్స్, సూపర్ హిట్ సాంగ్స్ బద్రి సినిమాను బాక్సాఫీస్ విన్నర్ చేశాయి. ఈ సినిమాలో రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. బద్రి 25 ఏళ్ల యానివర్సరీని ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.