అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన ఖుషి సినిమా జోరు చూపిస్తోంది. రేపు ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో 2లక్షల టికెట్స్ అమ్ముడవడం సర్ ప్రైజ్ చేస్తోంది. ఇది కేవలం బుక్ మై షోలో సేల్ అయిన టికెట్ల సంఖ్య. ఖుషి మీద అభిమానుల్లో ఉన్న క్రేజ్ ను ఈ నెంబర్స్ చూపిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. ఖుషి పాటలు సూపర్ హిట్టవడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సమంత, విజయ్ కలిసి డ్యాన్సులు చేసిన ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మ్యూజిక్ కన్సర్ట్ తర్వాత ఖుషి మీద హైప్ పెరిగింది. సినిమాకు చేస్తున్న అగ్రెసివ్ ప్రమోషన్ కూడా సినిమాను ప్రేక్షకుల్లోకి బాగా తీసుకెళ్లింది. ఈ ప్రయత్నాలన్నీ ఖుషి అడ్వాన్స్ బుకింగ్స మీద ఇంపాక్ట్ చూపించాయి.