హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ లో మళ్లీ కదలిక

అప్పుడెప్పుడో లాక్ డౌన్ ముందు ప్రారంభమైన పవన్ సినిమా హరి హర వీరమల్లు…కోవిడ్ సహా అనేక కారణాలతో వాయిదాలు పడుతూ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ఇంత ఆలస్యమవడం అభిమానులకు నచ్చడం లేదు. ఎందుకంటే ఇదొక స్పెషల్ మూవీగా మారుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. అటు దర్శకుడు క్రిష్ కూడా హిస్టారికల్ మూవీస్ చేసిన అనుభవం గలవాడే. రీజనబుల్ డైరెక్టర్ కాబట్టి హరి హర వీరమల్లు తప్పకుండా బాగుంటుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.

పవన్ తన ప్రయారిటీ ప్రకారం సినిమాలకు డేట్స్ ఇస్తూ వస్తున్నారు. హరి హర వీరమల్లు హిస్టారికల్ మూవీ కాబట్టి .కొంత టైమ్ తీసుకుని ప్రశాంతంగా చేద్దామని అనుకుంటున్నాడేమో. ఏమైనా బ్రో, ఓజీ లకు డేట్స్ ఇచ్చే పవన్….హరి హరకు మాత్రం అంత స్పీడ్ గా వర్క్ చేయడం లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో తాజాగా కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారని సమాచారం. విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఈ సీక్వెన్స్ షూటింగ్ కోసం పనిచేయబోతున్నారు. ఏమైనా హరి హరకు మోక్షం వచ్చే ఏడాదికే అని అర్థమవుతోంది.