మహేష్ బర్త్ డేకి ఫ్యాన్స్ కి ట్రిఫుల్ ధమాకా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మహేష్ కు జంటగా మీనాక్షి చౌదరి, శ్రీలీల నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో గుంటూరు కారం సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అభిమాన హీరో పుట్టినరోజు ఫ్యాన్స్ కు పండగలాంటిది. ఆగష్టు 9న మహేష్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులకు ఒకటి కాదు రెండు కాదు ట్రిఫుల్ ధమాకా అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న మూడు అప్ డేట్ రానున్నాయట. గుంటూరు కారం మూవీ నుంచి మరో టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అలాగే మహేష్ బాబు కెరీర్ లో మరచిపోలేని సినిమాల్లో ఒకటి బిజినెస్ మేన్. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.

అలాగే మహేష్ బాబు, రాజమౌళిల కాంబినేషన్లో రూపొందే పాన్ వరల్డ్ మూవీ అనౌన్స్ మెంట్ కూడా ఆరోజున రానుందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబో గురించి ఎప్పటి నుంచో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ నుంచి వర్క్ షాపుతో ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేయనున్నారు. ఇలా మహేష్ బాబు పుట్టినరోజున గుంటూరు కారం టీజర్ రిలీజ్, బిజినెస్ మేన్ రీ రిలీజ్, రాజమౌళితో మూవీ అనౌన్స్ మెంట్ వస్తే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు నిజంగా పండగే.