బ్లాక్ బస్టర్ కొట్టేదాకా అఖిల్ బయటకు రాడట

అఖిల్(Akhil) హీరోగా ఎంట్రీ ఇవ్వకు ముందు నుంచీ ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉండేవి. అయితే.. తొలి సక్సెస్ సాధించడానికి నాలుగో సినిమా వరకు వెయిట్ చేయాల్సివచ్చింది. ఐదవ సినిమాగా చేసిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అఖిల్ కొత్త సినిమా అప్ డేట్ లేదు. అయితే.. అఖిల్ గురించి నాగార్జున(Nagarjuna) ఓ సీక్రెట్ బయటపెట్టారు. ఇంతకీ.. ఏంటా సీక్రెట్..? అఖిల్ కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

అఖిల్ కొత్త సినిమా యువీ క్రియేషన్స్ లో ఉంటుందని ప్రచారం జరుగుతుంది కానీ.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. అయితే.. అక్కినేని శత జయంతి సందర్భంగా అయినా అఖిల్ సినిమా అనౌన్స్ చేస్తారనుకుంటే.. అదీ చేయలేదు. అక్కినేని శత జయంతి వేడుకను మాత్రం అభిమానులతో సెలబ్రేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు కానీ.. అఖిల్ మాత్రం కనిపించలేదు. ఇది అభిమానులకు అసంతృప్తి కలిగించింది. ఇదే విషయం గురించి నాగార్జుననే అడిగితే.. అసలు సీక్రెట్ బయటపెట్టారు. మేటర్ ఏంటంటే.. హిట్టు కొట్టే దాకా అఖిల్ తన అభిమానుల ముందుకు రానని చెప్పాడన్నారు నాగార్జున.

ఇలాంటి శపధాలు రాజకీయాల్లో చేస్తుంటారు. సినిమా హీరోలు ఇలా శపధాలు చేయరు కానీ.. అఖిల్ మాత్రం చాలా పట్టుదలగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ బస్టర్ కొట్టాలని తపిస్తున్నాడు. ఆ హిట్.. నెక్ట్స్ మూవీనే కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇంతకీ అఖిల్ కొత్త సినిమా ఎప్పుడంటే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. యువీ క్రియేషన్స్ దృష్టి అంతా విశ్వంభర మూవీ పై ఉంది. ఈ సినిమా కంప్లీట్ అయి బిజినెస్ వర్క్ అంతా అయిన తర్వాత అఖిల్ మూవీ పై కాన్ సన్ ట్రేషన్ చేయాలి అనుకుంటున్నారు. కొత్త సంవత్సరంలో అఖిల్ మూవీ ఉంటుందని టాక్.