బాలీవుడ్ హీరోయిన్ కు సారీ చెప్పిన రానా

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోతా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రానా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ గురించి చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి కారణమయ్యాయి. ఈ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ..తాము కలిసి నటించిన ది జోయా ఫ్యాక్టర్ సినిమా షూటింగ్ లో సోనమ్ కపూర్ ఎప్పుడూ జోక్స్ చేస్తూ దుల్కర్ టైమ్ వేస్ట్ చేసేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి వివాదాస్పదం అయ్యాయి. ఈ కాంట్రవర్సీపై తాజాగా వివరణ ఇచ్చారు రానా.

ఆయన ట్వీట్ చేస్తూ..నేనూ సోనమ్ కపూర్ స్నేహితులం. సరదాగా మాట్లాడుకుంటాం, ఒకరి మీద మరొకరం జోక్స్ వేసుకుంటాం. అలాగే నేను సరదాగా మాట్లాడిన మాటలు కాంట్రవర్సీకి కారణం అయ్యాయి. ఏమైనా ఈ విషయంలో నేను సారీ చెబుతున్నా. దీన్ని ఇక్కడితో వదిలేస్తారని ఆశిస్తున్నా. అని పేర్కొన్నారు.

రానా తాజా ట్వీట్ కు నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. బాలీవుడ్ లో ఘాజీ, ధమ్ మారో ధమ్, బేబీ, ది జోయా ఫ్యాక్టర్ వంటి చిత్రాల్లో నటించారు రానా. అక్కడి స్టార్స్ లో చాలా మంది రానాకు స్నేహితులు ఉన్నారు.