పవన్ బర్త్ డేకు మూడు ట్రీట్స్ రెడీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) బర్త్ డే సెప్టెంబర్ 2న. ఈ రోజున ఫ్యాన్స్ కోసం మూడు ట్రీట్స్ రెడీ అవుతున్నాయి. ఒకటి పవన్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్(Gabbar singh) రీ రిలీజ్ కాగా..రెండోది ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagatsingh) సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇక మూడోది ఓజీ(OG) సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను పవర్ స్టార్ పుట్టినరోజునే రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఓజీ సినిమా నుంచి హంగ్రీ చీతా అనే ట్రాక్ ను గతంలో రిలీజ్ చేశారు.

ఈ మాంటేజ్ సాంగ్ ఛాట్ బస్టర్ హిట్ అయి రికార్డ్ వ్యూస్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓజీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో ఫస్ట్ కంప్లీట్ అయ్యి స్క్రీన్స్ మీదకు వచ్చే అవకాశాలున్న ఏకైక సినిమా ఓజీ. ఈ విషయం అభిమానులకూ తెలుసు కాబట్టే ఓజీ మీద వారంతా దృష్టి పెడుతున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ లో దర్శకుడు సుజీత్(Sujeeth) ఈ సినిమాను రూపొందిస్తున్నారు.