నాగ చైతన్య షాకింగ్ డెసిషన్

నాగచైతన్య తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ప్రస్తుతం విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ నెల రెండోవారంలో హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. నాగచైతన్య ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందట. విరూపాక్ష రిలీజైన తర్వాత నంచి కార్తీక్ దండు ఈ కథ పైనే కసరత్తు చేస్తున్నాడు. చైతన్యను కొత్తగా చూపించబోతున్నాడని సమాచారం.

నాగ చైతన్య 25వ సినిమాని కొత్త దర్శకుడుతో చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కిషోర్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ అందులోని క్యారెక్టర్ కొత్తగా ఉండడంతో ఓకే చెప్పాడట. ప్రస్తుతం ఈ కథను తుది మెరుగులు దిద్దుతున్నాడట. ఈ చిత్రాన్ని బాహుబలి ప్రొడ్యూసర్స్ నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఫైనల్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను ప్రకటిస్తారట. కెరీర్ లో ల్యాండ్ మార్క్ అయిన 25 చిత్రానికి ఎవరైనా స్టార్ డైరెక్టర్ తో చేయాలి అనుకుంటారు కానీ..నాగచైతన్య కొత్త దర్శకుడుతో సినిమా చేస్తుండడం విశేషం.