ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. ఈ క్రేజీ సినిమా నుంచి బిగ్ ఇప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్ ఈ సినిమా సెట్ లో ఈ నెల 22వ తేదీ నుంచి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ లేని సీన్స్ తెరకెక్కిస్తున్నారు.
ఎన్టీఆర్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే వచ్చే ఏడాది జనవరి రిలీజ్ అని ప్రకటించారు. అయితే ఇప్పుడా తేదీ ఏప్రిల్ 9కి మారిందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ వరల్డ్ లో ఎన్టీఆర్ ఎలాంటి వయలెన్స్ చూపించనున్నాడు అనేది మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తోంది.