అఖిల్ ఏజెంట్ వచ్చింది.. వెళ్లిపోయింది. ఆతర్వాత అఖిల్ నుంచి నెక్ట్స్ మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. కొత్త దర్శకుడు అనిల్ తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ మూవీ టైటిల్ ధీర అని.. ఇది సోషియో ఫాంటసీ మూవీ అని కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రకటిస్తారని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటే.. అఖిల్ శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
దీంతో అఖిల్ నెక్ట్స్ ఏంటి..? కొత్త దర్శకుడితో సినిమానా..? శ్రీకాంత్ అడ్డాలతో సినిమానా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేయాలి అనుకున్న అఖిల్ ఇప్పుడు ప్లాన్ మార్చాడట. రెండు సినిమాలను ఒకేసారి చేయాలి అనుకుంటున్నాడట. అతి త్వరలోనే ఈ రెండు సినిమాలను అనౌన్స్ చేయనున్నాడని తెలిసింది. అఖిల్ పై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి… ఈ సినిమాలతో అయినా అఖిల్ అంచనాలను అందుకుని ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.