నెటిజన్స్ కు మళ్లీ దొరికిపోయిన తమన్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎన్ని హిట్ ఆల్బమ్స్ చేసినా కాపీ క్యాట్ అనే ముద్ర పోవడం లేదు. తెలుగులో వెరీ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ ఓజీకి తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓజీ గ్లింప్స్ లో బీజీఎం హైలైట్ అయ్యింది. అయితే ఇదీ కూడా కాపీనే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.

ఎపిడమిక్ ఎలక్ట్రానిక్ అనే యూట్యూబ్ ఛానెల్ లో ప్లాషర్ అల్ఫాగన్ అనే పోస్ట్ ఉంది. నెల కిందట చేసిన ఈ పోస్టులో సౌండింగ్ సేమ్ ఓజీ గ్లింప్స్ కు తమన్ ఇచ్చిన బీజీఎం లాగే ఉంది. దీంతో తమన్ బ్రోను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తమన్ తమను ఎప్పుడూ డిజప్పాయింట్ చేయడని, వరల్డ్ మ్యూజిక్ ను పరిచయం చేస్తున్నాడని సెటైర్స్ వేస్తున్నారు.

తమన్ అన్న ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ..సైలెంట్ గా లేపేశాడు అంటూ కొందరు పెట్టిన కామెంట్స్ ఫన్ తెప్పిస్తున్నాయి. గతంలో మీడియా ఈ కాపీ ట్యూన్స్ గురించి అడిగితే నా వర్క్ గురించి నా డైరెక్టర్స్, హీరోస్ కు తెలుసు మిగతా వారి గురించి నాకు అవసరం లేదంటూ ఆన్సర్ చెప్పాడు.