నాగశౌర్య మాస్ ప్రయత్నం ఫలిస్తుందా..?

నాగశౌర్య మన పక్కంటి కుర్రాడులా ఉంటాడు. ఊహలు గుసగుసలాడే, కళ్యాణ వైభోగం, ఛలో తదితర ఫీల్ గుడ్ మూవీస్ తో సక్సెస్ సాధించాడు. అయితే.. నాగశౌర్యకు మాత్రం మాస్ సినిమాలు చేయాలి. మాస్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తపిస్తున్నాడు. ఆమధ్య అశ్వథ్థామ అనే మాస్ యాక్షన్ మూవీ చేశాడు. ఆ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది.. ఫరవాలేదు అనిపించింది కానీ.. కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. అయినప్పటికీ నాగశౌర్య మాస్ ప్రయత్నం ఆపలేదు.. చేస్తూనే ఉన్నాడు.

తాజాగా నాగశౌర్య రంగబలి అనే సినిమా చేస్తున్నాడు. యుక్తి తరేజ ఈ చిత్రంలో కథానాయిక. ఈ చిత్రానికి నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఎలాగైనా సరే మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని ఎంతో కసితో ఈ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు పాజిటివ్ టాక్ వచ్చింది. టీమ్ అంతా ఈ సినిమా సక్సెస్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి పవన్ సిహెచ్ సంగీతం అందించారు. మరి.. ఈ సినిమాతో అయినా నాగశౌర్య ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.