Telugu Indian Idol Season 3: కీలక దశకు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. టాప్-12 కంటెస్టెంట్స్ వీళ్లే

0
29
కీలక దశకు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. టాప్-12 కంటెస్టెంట్స్

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కీలకమైన ఓటింగ్ దశలోకి ప్రవేశించింది. గత మూడు వారాలుగా స్ట్రీమింగ్ అయిన ఆరు థ్రిల్లింగ్ ఎపిసోడ్‌లు వీక్షకులను ఆకర్షించాయి. ఇప్పుడు మూడో సీజన్ కీలకమైన ఓటింగ్ దశకు చేరుకోవడంతో ఈ వారం నుంచి సింగింగ్ పోటీలు మరింత రసవత్తరంగా సాగనున్నాయి. వచ్చే వారం నుంచి పబ్లిక్ ఓటింగ్ ఆధారంగా ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. చివరి వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటాయి. మిగిలిన 5-6 ఫైనలిస్టులు రాబోయే గ్రాండ్ ఫినాలేలో టైటిల్ కోసం పోటీపడతారు. కాగా ఇండియన్ ఐడల్ విజేతలను ఎంచుకోవడానికి సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తోంది ఆహా. అంటే మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ కు ఓటు వేసి మద్దతు తెలపవచ్చు. ఇందుకోసం ఆహా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓటు వేయవచ్చు. కాగా ప్రతి పోటీదారునికి నిర్దేశించిన నంబర్‌లకు మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా కూడా ప్రజలు ఓటు వేయవచ్చు. ఓటింగ్ లైన్లు శుక్రవారం రాత్రి 7 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. ఆదివారం ఉదయం 7 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంటుంది.

ఆహా ఇండియన్ ఐడల్ మూడో సీజన్‌కు సంబంధించిన ఆడిషన్‌లకు అత్యధిక స్పందన లభించింది, 15,000 కంటే ఎక్కువ మంది ఔత్సాహిక గాయకులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చివరకు 12 మంది టాప్ కంటెస్టెంట్స్ తదుపరి రౌండ్ కు అర్హత సాధించారు. ఈ ఫైనలిస్టులలో భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుదిన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం వంటి ట్యాలెంటెడ్ సింగర్లు ఉన్నారు. ఇందులో ఆరుగురు పోటీదారులకు గోల్డెన్ మైక్‌లు లభించగా, మిగిలిన ఆరుగురికి గోల్డెన్ టిక్కెట్‌లు లభించాయి.

ఇవి కూడా చదవండి

గోల్డెన్ మైక్ అందుకున్న కంటెస్టెంట్స్ నేరుగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. అదే సమయంలో, గోల్డెన్ టిక్కెట్‌ను పొందిన వారు పోటీలో చోటు కోసం న్యాయనిర్ణేతల నుండి ఆమోదం పొందాల్సి ఉంటుంది.

గోల్డెన్ మైక్ గ్రహీతలు:
1. స్కంద
2. హరిప్రియ
3. శ్రీ కీర్తి
4. కేశవ్ రామ్
5. సాయి వల్లభ
6. అనిరుధ్ సుస్వరం

గోల్డెన్ టిక్కెట్ గ్రహీతలు:

1. ఎల్ కీర్తన
2. భరత్ రాజ్
3. రజనీ శ్రీ పూర్ణిమ
4. నజీరుద్దీన్ షేక్
5. ఖుషాల్ శర్మ
6. దువ్వూరి శ్రీధృతి

కాగా ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అప్ డేట్స్ ను పొందవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here