Telugu Indian Idol 3: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.. సింగర్ కార్తీక్ బ్యాండ్‌లోకి తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ కేశవ్ రామ్‌

0
46
కార్తీక్ బ్యాండ్‌లోకి తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ కేశవ్ రామ్‌

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ ఎంతో మంది సింగర్స్ ను వెలుగులోకి తీసుకువస్తుంది. తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా ఎంతోమంది సింగర్స్ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ షో తర్వాత మంచి మంచి అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో పాల్గొన్న కేశవ్ రామ్‌ కు అద్భుత అవకాశం దక్కింది. స్టార్ సింగర్ కార్తీక్ బ్యాండ్ లో ప్రదర్శన ఇచ్చే థ్రిల్లింగ్ అవకాశం లభించింది. కేశవ్ రామ్‌కి ఇటీవల 6 జూలై 2024న చెన్నైలో జరిగిన కార్తీక్ మ్యూజిక్ ఈవెంట్ లో పాటిస్పెట్ అవకాశం లభించింది.

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో కేశవ్ రామ్ అద్భుతమైన ప్రదర్శనతో  ఆకట్టుకున్నాడు. తన సింగింగ్ టాలెంట్‌తోపాటు మాండలిన్ అద్భుతంగా ప్లే చేస్తాడు. తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులనే కాదు జడ్జస్ ను కూడా ఫిదా చేశాడు కేశవ్ రామ్. అతని ప్రదర్శన నచ్చి సింగర్ కార్తీక్ కేశవ్ ను తన బ్యాండ్ లో పెడతావా అని బంపర్ ఆఫర్ అందించాడు. దాంతో  ఆనందంతో పొంగిపోయిన కేశవ్, “వావ్, ష్యూర్!” అంటూ కార్తీక్ ఇచ్చిన ఆఫర్ ను అందుకున్నాడు.

చెన్నైలోని నందనంలోని YMCA గ్రౌండ్‌లో జరిగిన ఈమ్యూజిక్ ఈవెంట్ లో కేశవ్ రామ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ ఈవెంట్ కు ఫ్యాన్స్ , మ్యూజిక్ లవర్స్ భారీగా వచ్చారు. ఇంత పెద్ద స్టేజ్ పై కార్తిక్ తో కలిసి కేశవ్ రామ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. కేశవ్ రామ్ మరోసారి తన టాలెంట్ తో అందరిని ఆకట్టుకున్నాడు. కేశవ్ రామ్, వాస్తవానికి మెల్‌బోర్న్‌కు చెందినవాడు. ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు.  సంగీతం పట్ల అమితమైన మక్కువ ఉన్న కేశవ్ రామ్. ఇండియాలో మంచి సింగర్ గా, మ్యూజిషన్ గా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే స్టార్ సింగర్ అయిన కార్తిక్ బ్యాండ్ లో పర్ఫామ్ చేసే అవకాశం అందుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here