Monday, December 30, 2024
Google search engine
HomeUncategorizedTaapsee Pannu : అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి.. ఆసక్తికర కామెంట్స్ చేసిన తాప్సీ...

Taapsee Pannu : అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి.. ఆసక్తికర కామెంట్స్ చేసిన తాప్సీ పన్నూ..

అంబానీ ఇంట పెళ్లి సందడి.. కొని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పెళ్లికి సంబంధించిన ముచ్చట్లే. ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో జరిగిన ఈ వివాహ వేడుకకు సౌత్, నార్త్ సినీ సెలబ్రెటీస్, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. అలాగే ప్రపంచదేశాలకు చెందిన నాయకులు, వ్యాపారవేత్తలు, హాలీవుడ్ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలలో వారం రోజుల ముందు నుంచే బాలీవుడ్ స్టార్స్ అందరూ అక్కడే ఉండిపోయారు. వివాహనికి ముందు జరిగే మమేరు, సంగీత్, మెహందీ, హల్దీ ఫంక్షన్స్ లో బీటౌన్ తారలు చేసిన హడావిడి గురించి చెప్పక్కర్లేదు. అయితే ఈ వేడుకలలో కొందరు బాలీవుడ్ స్టార్స్ మాత్రం కనిపించలేదు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి హాజరుకాకపోవడంపై హీరోయిన్ తాప్సీ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి వెళ్లకపోవడంపై స్పందించింది. ‘నాకు వ్యక్తిగతంగా తెలియదు. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నది. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథి కుటుంబానికి మధ్య కనీసం ఏదో ఒకరకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తాను. అలాంటి వివాహాలకు మాత్రమే హాజరవుతాను.’ అంటూ చెప్పుకొచ్చింది. తాప్సీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అంబానీ ఇంట పెళ్లి వేడుకలలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొణె, సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్, వెంకటేశ్, రానా దగ్గుబాటి, అక్కినేని అఖిల్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ హాజరయ్యారు.

ఇక తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. వో లడ్కీ హై కహాన్, ఫిర్ ఆయీ హాసీనా దిల్ రుబా, ఖేల్ ఖేల్ మే వంటి చిత్రాల్లో నటిస్తుంది. అలాగే ఇటీవలే తన ప్రియుడు మథియాస్ బోతో అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments