Swapna Varma: తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆత్మహత్య..

0
29
Swapna Varma: తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆత్మహత్య..

Swapna Varma: తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆత్మహత్య..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‏లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ (33) ఆత్మహత్యకు పాల్పడింది. కావూరి హిల్స్‌లో తాను ఉంటున్న నివాసంలో స్వప్న ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గత రెండు రోజల క్రితమే తన ఫ్లాట్‌ డోర్ లాక్ చేసుకుని ఆమె ఉరి వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు ఫ్లాట్స్ వారు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు డోర్‌ను అన్‌లాక్ చేసి చూడగా స్పప్న వర్మ సూసైడ్ చేసుకుని కనిపించింది. ఆర్థిక ఇబ్బందులతోనే స్వప్తనవర్మ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. గత ఆరు నెలలుగా ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న స్వప్న వర్మ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

స్వప్నవర్మ స్వస్థలం రాజమండ్రి కాగా, మూడేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తోంది. సినీ రంగంలో పనిచేసేందుకు మూడేళ్ల క్రితమే ఆమె హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది నుంచి మాదాపూర్ లోని కావూరి హిల్స్ లో నివాసం ఉంటూ సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తుంది. అయితే గత ఆరు నెలలుగా ఆమెకు ఎలాంటి ప్రాజెక్టులు రాకపోవడంతో ఖాళీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆమె ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు అందించారు ఇరుగుపొరుగువారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలకొట్టి చూడగా.. విగత జీవిగా కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here