కోలీవుడ్ హీరో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంలోనే కాదు.. తెలుగు, హిందీ భాషలలోనూ సూర్యకు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ హీరో సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ అందుకున్న సూర్య.. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో అదరగొట్టారు. దీంతో ఆయన కీర్తి రోజురోజుకూ పెరుగుతోంది. నేడు (జూలై 23) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సూర్య చిన్ననాటి ఫోటోస్, రేర్ వీడియోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే తమ ఫేవరెట్ హీరో గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ సూర్య హీరో. సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంటూనే అటు సామాజిక సేవ చేయడంలో ముందుంటాడు. కష్టాల్లో ఉన్న అభిమానులకు సాయం చేస్తుంటాడు.
నటుడిగా తనను తాను నిరూపించుకున్న సూర్య.. ఇప్పటివరకు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాడు. అలాగే ఇప్పుడున్న హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లో ఒకరు. అత్యంత ధనవంతులైన నటుల్లో ఆయన ఒకరు. కన్నడ నటుడు శివకుమార్ కుమారుడు సూర్య. దీంతో సినీ పరిశ్రమతో అనుబంధం ఏర్పడింది. 1997లో విడుదలైన ‘నెరుక్కు నాయర్’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఖాకా ఖాకా’ అతనికి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సూర్య కెరీర్ లో చాలా ప్రత్యేకం.
సినిమాల ఎంపికలో సూర్య తనదైన నియమాలను పాటించాడు. కంటెంట్ ప్రాధాన్యత, మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటాడు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకును మెప్పిస్తాడు.. ఇంతకుముందు విడుదలైన ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్‌లో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర సినిమాకే హైలెట్ అయ్యింది.. అలాంటి పాత్రల ఎంపిక వల్ల సూర్య అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
2010 నుంచి సూర్య ఈ భారీ పారితోషికాన్ని అందుకుంటున్నాడు. అదేవిధంగా వ్యాపార రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. నటనతో పాటు సినిమా నిర్మాణం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు. అతనికి విలాసవంతమైన ఇళ్లు, కార్లు ఉన్నాయి. నటి జ్యోతికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం సూర్యకు ముంబైలో రూ.70 కోట్ల ఇల్లు ఉంది. ఇటీవలే ఆ ఇంటిని కొనుగోలు చేశారు. దీనికి కారణం వారి పిల్లల చదువులే. ప్రస్తుతం వారి పిల్లలు ముంబైలో చదువుతున్నారు. ఈ కారణంగా వారు అక్కడే స్థిరపడ్డారు.
సూర్య ఆస్తులు 350 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. అతనికి చెన్నైలో ఇల్లు ఉంది. ఇప్పటికే సూర్య వద్ద చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. తన సొంత బ్యానర్‌లో ఎన్నో సినిమాలను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సూర్య ‘కంగువ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.